‘‘శానిటరీ న్యాప్కిన్లను ఉచితంగా అందించాలి ’’

by  |

దిశ, హైదరాబాద్: రాష్ట్రంలోని అనాథ శరణాలయాలు, బాలికల వసతి గృహాలలోని బాలికలందరికీ శానిటరీ న్యాప్కిన్లను ఉచితంగా అందించాలని బాలల హక్కుల సంఘం కోరింది. ఈ మేరకు ఆ సంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథో‌డ్‌ను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రాష్ట్ర వ్యాప్తంగా 431 అనాథాశ్రమాలను ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇవి కాకుండా, ప్రభుత్వ హాస్టళ్లలో అత్యధిక శాతం అమ్మాయి‌లే ఉన్నారని తెలిపారు. వారికి ప్రకృతి సిద్ధంగా వచ్చే నెలసరి కోసం శానిటరీ న్యాప్కిన్లు అవసరం అవుతాయనీ, వారు పరిశుభ్రమైన న్యాప్కిన్లు కాకుండా ఇతర పద్ధతులు ఆచరిస్తే బ్యాక్టీరియా, ఫంగల్ వ్యాధులతో పాటు ఇతర ఇతర అనారోగ్యం బారినపడతారని వివరించారు. దాతలపై ఆధారపడ్డ ఈ ఆశ్రమాలు భోజన సదుపాయం గురించి అడుగ గలుగుతాయి కానీ, ప్రత్యేకంగా ఈ అవసరం కోసం దాతలను సంప్రదించలేరని తెలిపారు. వెంటనే ఈ విద్యార్థినులకు నెలసరి న్యాప్కిన్లు స్తీ, శిశు సంక్షేమ శాఖ ఉచితంగా అందించాలని బాలల హక్కుల సంఘం మంత్రి సత్యవతి‌కి లిఖిత పూర్వకంగా శనివారం విజ్ఞప్తి చేసింది.

Tags: sanitary napkins, girls, in orphanages, need, child and women welfare dept, minister satyavati

Next Story

Most Viewed