ఈ-ఫార్మసీ వివాదంలో అమెజాన్

by  |
ఈ-ఫార్మసీ వివాదంలో అమెజాన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్(All India Organization of Chemists and Druggists).. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ మేనేజర్ అమిత్ అగర్వాల్‌లకు లేఖ రాసింది. అలాగే, పీఎంవోకు, కేంద్ర హోమ్ మంత్రి, ఇతర ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధికారులకు కూడా లేఖను పంపినట్టు తెలుస్తోంది.

అమెజాన్ (Amazon) ఇండియా ఈ-ఫార్మసీ (E-Pharmacy) రంగంలోకి రావడం చట్ట విరుద్ధమని ఆ లేఖలో పేర్కొంది. దేశ ప్రజల ఆరోగ్య ప్రయోజనాలకు ఇది విరుద్దమని వెల్లడించాయి. ఎలాంటి ఆన్‌లైన్ ఫార్మసీ ద్వారా కూడా హోమ్ డెలివరీ చేయలేమని, అలా చేస్తున్న సంస్థలు ఇప్పటికే భారత చట్టాల ప్రకారం కోర్టు చర్యలను ధిక్కరిస్తున్నట్టే అని ఏఐవోసీడీ (AIOCD) అమెజాన్‌కు వివరించింది.

ఈ విషయంపై పూర్తి వివరాలు సిద్ధంగా ఉన్నాయని, ఈ-ఫార్మసీ విభాగంలో రావడం వల్ల అమెజాన్‌కు ఉన్న పేరు అపఖ్యాతి పాలవుతుందని ఏఐవోసీడీ (AIOCD) లేఖలో పేర్కొంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (Indian Medical Association) ఆన్‌లైన్ ఫార్మసీల (online pharmacies)కు వ్యతిరేకంగా ఉందని, ఆన్‌లైన్ స్టోర్ల ద్వార చౌకైన, నకిలీ ఔషధాలను ప్రోత్సహిస్తున్నారని ఏఐవోసీడీ (AIOCD) స్పష్టం చేసింది. ఇది డాక్టర్‌కు, రోగికి మధ్య సంబంధాలను దెబ్బతీస్తుందని, వైద్యుల పర్యవేక్షణను తగ్గిస్తుందని, ఈ పరిణామాలు మాదక ద్రవ్యాలకు దారి తీస్తాయని సూచించింది.

Next Story

Most Viewed