పటాన్ చెరు పారిశ్రామిక వాడలో పేలిన రియాక్టర్

55

దిశ, పటాన్ చెరు : పటాన్ చెరు నియోజకవర్గం జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడ‌లోని వర్ధమాన్ కెమికల్స్ పరిశ్రమలో గురువారం రియాక్టర్ పేలింది. పరిశ్రమలోని రియాక్టర్ పేలడంతో ఒక కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సందర్శించారు.

ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. పరిశ్రమలో భారీ శబ్దంతో రియాక్టర్ పేలడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాగా, పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..