చర్లపల్లి ఆర్ ఓబీ ని రెండు నెలల్లో వినియోగంలోకి తెస్తాం: ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

by  |
చర్లపల్లి ఆర్ ఓబీ ని రెండు నెలల్లో వినియోగంలోకి తెస్తాం: ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి
X

దిశ, ఉప్పల్: చర్లపల్లి పరిసరప్రాంతాలు, పారిశ్రామిక వాడలకు తలమానికంగా నిలవనున్న ఆర్ ఓ బి నిర్మాణం పనులను ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేసి ప్రజల సౌకర్యార్థం వినియోగంలోకి తీసుకొస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి వద్ద శరవేగంగా జరుగుతున్న ఆర్ ఓ బి నిర్మాణం పనులను శనివారం రోజు జిహెచ్ఎంసి, రోడ్లు భవనాల శాఖ, ట్రాన్స్కో వివిధ విభాగాల అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైల్వే పై వంతెన నిర్మాణ పనులకు అవసరమైన 4 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.

చర్లపల్లి ఆర్ ఓబీ పనులు మొదలై నాలుగు సంవత్సరాలు అవుతున్నప్పటికీ, అవసరమైన నిధులను వెచ్చిస్తూ నిర్మాణ పనుల్లో వేగం పెంచడం జరిగిందన్నారు. ఫిబ్రవరి చివరి వారం లోగా బ్రిడ్జి పనులను పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్, రోడ్లు భవనాల శాఖ డీఈ రవీందర్, ఆర్ ఓబీ కాంట్రాక్టర్ సుబ్రహ్మణ్యం, ఇంజనీరింగ్ విభాగం ఈ ఈ కోటేశ్వరరావు, డీఈ శ్రీరాములు, ఎలక్ట్రికల్ ఏఈ ప్రత్యూష, కుషాయిగూడ ఇన్స్పెక్టర్ మన్మోహన్, మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి, చర్లపల్లి కాలనీల సమాఖ్య ప్రతినిధి ఎంపల్లి పద్మా రెడ్డి ,టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గరిక సుధాకర్, టిఆర్ఎస్ పార్టీ చర్లపల్లి డివిజన్ అధ్యక్షులు డప్పు గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed