కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే

by Aamani |
కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే
X

దిశ, సుల్తానాబాద్ : ఎలిగేడు మండలం తన స్వగ్రామమైన శివపల్లిలో కుటుంబ సమేతంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణ రావు మాట్లాడుతూ, పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి మెజారిటీ వస్తుందని, పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ భారీ మెజారిటీతో విజయం సాదించబోతున్నారని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

Next Story

Most Viewed