మూన్​ ఎర్త్​ కక్ష్యలోకి చాంగ్​-5

by  |
మూన్​ ఎర్త్​ కక్ష్యలోకి చాంగ్​-5
X

దిశ, వెబ్ డెస్క్: చైనీస్​ దేవత పేరు మీద చంద్రుడి పైకి పంపిన చాంగ్​-5 మిషన్​లోని ఆర్బిటార్​-రిటర్నర్​ చంద్ర కక్ష్యలోకి ప్రవేశించిందని చైనా నేషనల్​ స్పేస్​ అడ్మినిస్ట్రేషన్​ ఆదివారం వెల్లడించింది. చంద్రుడి ఉపతరితలం నుంచి 230 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు నాలుగు 150 ఎన్​ ఇంజిన్లను 22 నిమిషాల పాటు మండించి ఆర్బిటార్​ను కక్ష్యలోకి పంపినట్టు ఓ వార్త సంస్థ పేర్కొంది. రియల్​టైమ్​ మానిటరింగ్​ ప్రకారం ఆర్బిటార్​-రిటర్నర్​ కాంబినేషన్​ నిర్ధేశిత కక్ష్యలోకి సక్సెస్​పుల్​గా ఎంటరైందని సైంటిస్టులు చెప్పారు. చంద్రుడిపై నమూనాలు సేకరించిన తర్వాత ఇది మళ్లీ భూమికి చేరుకుంటుందన్నారు.

ఎలా పనిచేస్తుందంటే
చైనా నవంబర్​ 24న చాంగ్​-5 మిషన్​ను చంద్రుడిపైకి ప్రయోగించింది. దీనిలో ప్రధానంగా రెండు భాగాలున్నాయి. ఒకటి ఆర్బిటార్‌-లాండర్‌, రెండోది అసెండర్‌-రిటర్నర్‌. వీటన్నింటి బరువు కలిపి మొత్తంగా దాదాపు 8.2 టన్నులు ఉంటుంది. చంద్ర కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత లాండర్‌-అసెండర్‌, ఆర్బిటార్‌- రిటర్నర్‌ విడిపోతాయి. చంద్రుడి ఉపరితలంపై సుమారు 200 కిలోమీటర్ల ఎత్తులో ఆర్బిటార్‌-రిటర్నర్‌ పరిశోధనలు సాగిస్తే, చంద్రుడికి సమీపంలో గల ఓషన్‌ ఆఫ్‌ స్టార్మ్స్‌ వాయువ్య ప్రాంతంలో దిగి లాండర్‌-అసెండర్‌ నమూనాలు సేకరిస్తుంది. శిలలు, మట్టి సేకరించిన తర్వాత తిరిగి ఇవి వాహననౌకలోకి చేరుకుంటాయి. చంద్ర గ్రహంపై అడుగుపెట్టిన 48 గంటల్లో రోబోటిక్‌ ఆర్మ్‌ తవ్వకాలు మొదలుపెడుతుంది. సుమారు 2 కిలోల మేర నమూనాలు సేకరించడమే లక్ష్యంగా చైనా ఈ ప్రయోగం చేపట్టింది.



Next Story