పొంచి ఉన్న మరో పెను ముప్పు.. విజృంభించనున్న వరుణుడు..

by  |
పొంచి ఉన్న మరో పెను ముప్పు.. విజృంభించనున్న వరుణుడు..
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మరో సారి వరుణుడు విజృంభించనున్నాడు. ఇప్పటికే కురిసిన వర్షాల నుంచి ప్రజలు బయటపడలేక పోతున్నరు. అంతలోనే మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు ఇంకో భారీ తుఫాన్ విరుచుకు పడనుంది. మధ్య అండమాన్ సముద్రం నుంచి వీచే గాలుల ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురు, శుక్ర వారాల్లో రాష్ట్రంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.

రాబోవు 24 గంటలలో బంగాళాఖాతంలో ఈదురు గాలులు పెను తుఫాను గా మారుతాయని, అందుకే దానికి జవాద్ పేరును సూచించామని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫాను వాయువ్య దిశలో పయనించి శనివారం నాటికి ఒడిసా తీరాన్ని తాకనున్నట్టు అంచనా వేశారు. శుక్రవారం భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

రాయలసీమ, దక్షిణ కోస్తా లలో రెండు రోజులు తేలిక పాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్ర, శని వారాల్లో తీరం వెంట 80 నుండి 90 కిలో మీటర్లు వేగంతో ఈదురు గాలులు వీస్తాయని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. సముద్రం లో పరిస్థితులు బాగోలేవని, మత్సకారులెవరూ చేపల వేటకు పోవద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను హెచ్చరిస్తూనే అధికారులను అప్రమత్తం చేశారు.



Next Story

Most Viewed