వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న హైడ్రామా

106

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. టీఆర్ఎస్-బీజేపీ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల వార్ కొనసాగుతోంది. రూ.196కోట్ల స్మార్ట్ సిటీ నిధుల దారి మల్లింపుపై భద్రకాళి అమ్మవారి ఆలయం వేదికగా ప్రమాణం చేసి బహిరంగ ప్రకటన చేయాలని బండి సంజయ్ సవాళ్లు విసిరిన సంగతి తెలిసిందే. నేటి సాయంత్రంతో సంజయ్ సవాల్ గడువు పూర్తి కానుంది. మరోవైపు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు బండి సంజయ్‌కు కౌంటర్ సవాల్ విసిరారు. బండి సంజయ్‌కి దమ్ముంటే తన కన్న తల్లి మీద ప్రమాణం చేసి వాస్తవాలు మాట్లాడాలని ప్రతి సవాల్ చేశారు. తన కన్నతల్లితో వస్తే 48 గంటలు అవసరం లేదని… ఎనీ టైమ్ రెడీ అని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ భద్రకాళీ ఆలయానికి రానున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..