కేసీఆర్ కిట్ ఇస్తున్నారా లేదా..? : పౌరసరఫరాల శాఖ చైర్మన్

by  |
Charimen-1
X

దిశ, దుమ్ముగూడెం: మండల పరిధిలోని నర్సాపురం జెడ్పీహెచ్ఎస్ జిల్లా పరిషత్ పాఠశాలను తెలంగాణ పౌర సరఫరాల శాఖ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలతో కాసేపు మాట్లాడారు. మధ్యాహ్న భోజనం గురించి అడిగి తెలుసుకుని పరిశీలించారు. అనంతరం స్కూల్ వెనకాల నిర్మాణంలో ఉన్నటువంటి ఐటీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న గదులను పరిశీలించారు. వాటి నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడంతో వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా నర్సాపురం పీహెచ్ సీని సందర్శించి కేసీఆర్ కిట్ ఇస్తున్నారా లేదా అని గర్భిణీ స్త్రీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలును పరిశీలించి, బాలింతలకు తగు సూచనలు చేశారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎమ్మార్వో రవికుమార్, జెడ్పీటీసీ తెల్లం సీతమ్మ, సర్పంచ్ శివరామకృష్ణ, జిల్లా పరిషత్ పాఠశాల హెచ్ఎం, పీహెచ్ సీ డాక్టర్ చైతన్య తోపాటు పలువురు అధికారులు ఉన్నారు.

Next Story

Most Viewed