ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర బృందం

by  |
ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర బృందం
X

దిశ, వెబ్‎డెస్క్ : తెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ఠ నేతృత్వంలోని అధికారుల బృందం.. ముంపు ప్రాంతాల్లో రెండో రోజు పర్యటిస్తున్నారు. నగరంలోని నాగోల్, బండ్లగూడ, ఎల్బీనగర్ ముంపు ప్రాంతాలను కేంద్ర బృందం పరిశీలిస్తోంది. అనంతరం వరదలతో కలిగిన నష్టాన్ని అంచనా వేయనుంది.

కాగా, మొదటి రోజు హైదరాబాద్ పాతబస్తీలోని పలు కాలనీల్లో వరద ప్రభావిత ప్రాంతాలు పరిశీలించింది. వరదలతో దాదాపు రూ.8,633 కోట్ల మేర పంటనష్టం, రూ. 222 కోట్ల మేర రహదారులకు నష్టం సహా జీహెచ్​ఎంసీ పరిధిలో రూ.567 కోట్ల వరకూ నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందానికి వివరించారు.


Next Story

Most Viewed