కేంద్రం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

by  |

దిశ ,కంటోన్మెంట్ : ఎస్సీ వర్గీకరణకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని బోయిన్ పల్లి జీవిఆర్ గార్డెన్స్ లో ఆదివారం సాయంత్రం మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎస్సీ ఉధ్యోగుల 5వ జాతీయ మహాసభలు జరిగాయి. ఈ సభలో కేంద్ర మంత్రులు మురుగన్, నారాయణస్వామి, మందక్రిష్ణ మాదిగలు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని, వర్గీకరణ సాధించే వరకు బీజేపీ మీ వెంట ఉంటుందని అన్నారు. నా శక్తి ఉన్నంత వరకు ఎంఆర్ పీఎస్ కు అండగా ఉంటానని తెలిపారు. 2020 లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందన్నారు. దీని కోసం 7గురు జడ్జీల బృదం తో ఫైనల్ కానుందని, మరో బెంచ్ ఏర్పాటు చేయాలని, చేసేటట్లు కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

మంద క్రిష్ణ మాదిగ గొప్ప మానవతా వాదీ అని కిషన్ రెడ్డి కొనియాడారు. తాను ఎక్కడ, ఎప్పుడు కలిసినా వర్గీకరణపై తకు క్లాస్ పికుతుంటాని గుర్తు చేశాడు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయ శాఖ మంత్రి, తాను ముగ్గురం కలిసి చర్చించనున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. గతంలో వర్గీకరణ వద్దు అని ఐదుగురు న్యాయమూర్తులు, కావాలని మరో ఐదుగురు న్యాయమూర్తులు తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. మరో కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ జాతి ఎన్ని ఏళ్లుగా నో ఎదురుచూస్తుందన్నారు. వర్గీకరణకు కోసం మా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఎంఆర్ పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఉష మెహర కమిషన్ రిపోర్టు ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో జాతీయ వర్గీకరణ పెండింగ్ లో ఉందన్నారు. పార్లమెంట్ లో మంత్రులు గా ఉన్నమీ పై మాదిగ జాతి ఆధారపడి ఉందని అన్నారు.

మాదిగ జాతి మూడు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న విషయాన్ని మంత్రులకు కృష్ణ మాదిగ ఈ సందర్భంగా గుర్త చేశారు. నవంబర్ 14న చలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమానికి దళిత జాతి మొత్తం ఢిల్లీకి తరలి రావాలని పిలుపునిచ్చారు. దళిత ఉద్యోగులు ఒక్కోక్కరు ఇద్దరు విద్యార్థుల ను ఢిల్లీకి పంపించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తన ఉంగరం అమ్మి మన ఉద్యమం కోసం ముందుకు వచ్చిన మహానుభావుదు నారాయణ స్వామి అని, నేడు దేశానికి మంత్రి కావడం చాలా గర్వాంగా మందకృష్ణ మాదిగ ఉందన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మంత్రులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, భిక్షాల్ మాదిగ, శ్రీనివాస్,కాశిం,భాజపా మహిళ మోర్చ్ మహిళ నాయకురాలు ఆకుల విజయ,జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు రాములు, వివిద రాష్ట్రాల నుండి పేద ఎత్తున ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed