కేంద్ర మంత్రికి ట్విట్టర్ షాక్.. గంటసేపు అకౌంట్ బ్లాక్..!

by  |
కేంద్ర మంత్రికి ట్విట్టర్ షాక్.. గంటసేపు అకౌంట్ బ్లాక్..!
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వానికి, ట్విట్టర్‌కు మధ్య వార్ నడుస్తూనే ఉంది. కొత్తగా తీసుకొచ్చిన ఐటీ యాక్ట్-2021 నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ట్విట్టర్‌కు ఇంటర్మీడియరీ హోదాను కేంద్రం తొలగించిన విషయం తెలిసిందే. ఇది జరిగిన వారం రోజుల్లోనే ట్విట్టర్ కంపెనీ మరో దుస్సహసానికి పాల్పడింది. ఏకంగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అకౌంట్‌ను గంటసేపు బ్లాక్ చేసింది.

ఆ తర్వాత పునరుద్ధరించింది. అయితే, అమెరికా కాపీరైట్ చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నట్లు ట్విట్టర్ చెబుతోంది. యూఎస్ చట్టాన్ని చూపించి అకౌంటర్ బ్లాక్ చేసినట్లు సమాచారం. తన అకౌంట్‌ బ్లాక్ అయ్యిందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా నిర్దారించారు. కాగా, ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్‌పై ఎలాంటి చర్యలకు పూనకుంటుందో వేచిచూడాలి.


Next Story