ఎర్రకోట ఘటనపై కేంద్రం హోంశాఖ ఆగ్రహం..

by  |
ఎర్రకోట ఘటనపై కేంద్రం హోంశాఖ ఆగ్రహం..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతు ఉద్యమకారులు ఎర్రకోటపై సిక్కులకు సంబంధించిన నిషాన్ సాహిబ్ జెండాను ఎగురవేశారు. అంతటితో ఆగకుండా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ట్రాక్టర్ల విన్యాసాలతో పాటు కర్రలు, కత్తులతో పోలీసులపై దాడికి దిగడం, బెదిరింపులకు గురిచేయడం వంటివి చేశారు.

కాగా, ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అవ్వడమే కాకుండా, కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అనంతరం ఎర్రకోట వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విధ్వంసానికి కారకులైన వారిలో ఇప్పటికే 200మందిని అరెస్టు చేయగా, 35 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, ఈ కేసును కేంద్రం హోంశాఖ ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించింది. ఇదిలాఉండగా, ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించేందుకే అల్లర్లు సృష్టించారని రైతులు ఆరోపిస్తున్నారు.


Next Story