ఆరేళ్లలో పెట్రోల్, డీజిల్‌పై పెరిగిన పన్ను వసూళ్లు 300 శాతం!

by  |
petrol
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎక్సైజ్ సుంకం పెంపు వల్ల గడిచిన 6 ఏళ్లలో పెట్రోల్, డీజిల్‌పై పన్ను వసూళ్లు 300 శాతం కంటే అధికంగా పెరిగినట్టు కేంద్రం వెల్లడించింది. ప్రధాని మోదీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం ద్వారా రూ. 29,279 కోట్లను, డీజిల్‌పై రూ. 42,881 కోట్లను వసూలు చేసింది. అదే ఏడాది సహజవాయువుపై సుంకం ద్వారా రూ. 74,158 కోట్లను వసూలు చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్‌పై పన్ను వసూళ్లు 300 శాతానికి పైగా పెరిగాయని లోక్‌సభలో ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.

2020-21లో మొదటి 10 నెలల కాలంలో సహజవాయువుతో కలిపి వసూళ్లు రూ. 2.95 లక్షల కోట్లకు పెరిగాయని తెలిపారు. ‘అంతర్జాతీయంగా చమురు ధరల్లో మార్పుల వల్లే దేశీయంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయని, దేశీయంగా మౌలిక సదుపాయాయ్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం, వాటిని కొనసాగింపునకు ఎక్సైజ్ సుంకాం వినియోగిస్తున్నట్టు అనురాగ్ సింగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల కారణంగా ఎక్సైజ్ సుంకం పెరుగుదల తప్పదని ఆయన స్పష్టం చేశారు. మొత్తం పన్నుల ఆదాయంలో ఇంధనంపై విధించిన పన్నుల వాటా 2014-15లో 5.4 శాతం ఉంటే, 2020-21 నాటికి ఇది 12.2 శాతానికి పెరిగిందన్నారు. 2014లో పెట్రోల్ లీటర్‌పై ఎక్సైజ్ సుంకం రూ. 9.48 ఉండగా, ఇప్పుడు రూ. 32.9కి చేరుకుంది. డీజిపై ఆ సమయంలో రూ. 3.56 ఉంటే ఇప్పుడు రూ. 31.8కి పెరిగిందని అనురాగ్ సింగ్ స్పష్టం చేశారు.

Next Story

Most Viewed