ఇద్దరు పిల్లల పాలసీ ఆలోచనల్లేవ్.. కేంద్రం క్లారిటీ

by  |
ఇద్దరు పిల్లల పాలసీ ఆలోచనల్లేవ్.. కేంద్రం క్లారిటీ
X

న్యూఢిల్లీ: ‘ఇద్దరు పిల్లలు’ విధానం తెచ్చే యోచన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదా? అని అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి భారతి ప్రవీణ్ పవార్ సమాధానమిచ్చారు. అలాంటి ఆలోచనల్లేవని స్పష్టం చేశారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, అసోంలలో ఇద్దరు పిల్లల విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఇద్దరు పిల్లల విధానాన్ని తెచ్చే యోచన చేస్తున్నదా అంటూ బీజేపీ ఎంపీ ఉదయ్ పీ సింగ్ అడిగారు. అలాంటి ప్రతిపాదనలు పరిగణించడం లేదని కేంద్రమంత్రి పవార్ సమాధానమిచ్చారు. జనాభా నియంత్రణకు తెచ్చే కఠిన ఆంక్షలతో ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని, విదేశాల్లో ఈ ఉదంతాలు చూస్తున్నామని వివరించారు. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో పునరుత్పత్తిపై ఆంక్షలు విధించకుండా సమగ్ర వ్యూహంతో సత్ఫలితాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు.

Next Story