- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు అలర్ట్.. ఆ పని చేయకపోతే రూ.2 వేలు కట్
<p>దిశ, వెబ్‌డెస్క్: పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ.6 వేలు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. వీటిని మూడు విడతలుగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. త్వరలోనే 10వ విడత నగదును జమ చేయనుంది. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్‌ను ప్రవేశపెట్టింది. పీఎం కిసాన్ లబ్ధిదారులు ఈ-కేవైసి ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపింది. ఈ-కేవైసి చేయకపోతే 10వ విడత రూ.2 వేల పీఎం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ.6 వేలు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. వీటిని మూడు విడతలుగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. త్వరలోనే 10వ విడత నగదును జమ చేయనుంది. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్‌ను ప్రవేశపెట్టింది.
పీఎం కిసాన్ లబ్ధిదారులు ఈ-కేవైసి ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపింది. ఈ-కేవైసి చేయకపోతే 10వ విడత రూ.2 వేల పీఎం కిసాన్ నగదు జమ కాదని స్పష్టం చేసింది. ఈ-కేవైసి ప్రక్రియలో భాగంగా రైతులు తమ ఆధార్ కార్డును పీఎం కిసాన్ ఖాతాతో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లేదా దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్(CSC) ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
Next Story






