బ్రేకింగ్.. ఒమిక్రాన్ ఎఫెక్ట్.. రాష్ట్రాలకు కేంద్రం గైడ్ లైన్స్

by  |
బ్రేకింగ్.. ఒమిక్రాన్ ఎఫెక్ట్.. రాష్ట్రాలకు కేంద్రం గైడ్ లైన్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్టుల్లో కరోనా కొత్త వేరియంట్‌పై కేంద్రం.. రాష్ట్రాలకు గైడ్ లైన్స్ జారీ చేసింది. ఒమిక్రాన్ వ్యాప్తి ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కచ్చితంగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసుకోవాలని నిర్ణయించింది. ఈ టెస్టుల్లో పాజిటివ్ వస్తే నేరుగా క్వారంటైన్‌కు వెళ్లాల్సిందేనని నిబంధన విధించింది. ప్రయాణికులకు నెగిటివ్ వస్తేనే ఎయిర్‌పోర్టు నుంచి బయటకు పంపాలని తెలిపింది. శాంపిల్స్ సేకరించి టెస్టింగ్ కోసం జీనోమ్ సీక్వేన్సింగ్‌కు తరలించనున్నట్టు పేర్కొంది.

ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆంక్షలు విధించింది. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ రిపోర్టును తప్పనిసరిగా సమర్పించాలని నిబంధన విధించింది. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యాక మళ్లీ కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా, బోట్సువానా, ఇజ్రాయిల్, హాంకాంగ్, బెల్జియం దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కచ్చితంగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయనున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇండియాకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు ఇవి తప్పక చేయాల్సిందే.


Next Story

Most Viewed