గుంటూరు ఎస్పీపై సీబీఐ విచారణ

by  |
గుంటూరు ఎస్పీపై సీబీఐ విచారణ
X

గుంటూరు ఎస్పీ రామకృష్ణపై సీబీఐ విచారణ చేపట్టింది. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ముగ్గురిని అక్రమంగా నిర్బంధించారన్న కేసులో.. విచారణ జరపాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో ఢిల్లీ నుంచి సీబీఐ అధికారులు సోమవారం గుంటూరు వచ్చారు. ఈ కేసుపై సీసీఎస్ పోలీసులతో పాటు చేబ్రోలు పోలీసుల నుంచి సీబీఐ అధికారులు వివరాలు సేకరించారు. అటు ఎస్పీ రామకృష్ణను కూడా రహస్యంగా విచారించినట్లు తెలుస్తోంది.

అసలు ఏం జరిగిందంటే..

గుంటూరు జిల్లాలోని నారా కోడూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో గతేడాది అక్టోబర్‌లో అదుపులోకి తీసుకున్నారు. అయితే, అరెస్ట్ చేసిన 24 గంటల లోపు సంబంధిత కోర్టులో హాజరుపరచాలి. కానీ, తమ విషయంలో అలా జరగలేదని.. పోలీసులు తమను నిర్బంధించారని నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. డబ్బు కోసమే తమను రోజుల తరబడి వేదించరాని పిటిషన్‌లో వెల్లడించారు. కాగా, దీనిపై ప్రాథామిక విచారణ జరిపించాలని హైకోర్టు ఆదేశించగా అసలు నిజం బయటపడింది. నిందితులను అదుపులోకి తీసుకుంది సీసీఎస్ పోలీసులే అయినా.. ఎస్పీ రామకృష్ణ ఆదేశాలతోనే నిర్బంధించారని పిటిషనర్లు ఆరోపించారు. దీంతో హైకోర్టు సీబీఐ దర్యాప్తు చేయాలని రెండు వారాల క్రితం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసుపై సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు.

tags: cbi investigation, Guntur sp ramakrishna,

Next Story

Most Viewed