శభాష్ పోలీసు.. ఆటో డ్రైవర్ల గుట్టురట్టు

by  |
శభాష్ పోలీసు.. ఆటో డ్రైవర్ల గుట్టురట్టు
X

దిశ,కోదాడ: త్వరగా డబ్బు సంపాదించాలనే అత్యాశ, మనిషిని ఎంత చెడ్డ పని చేయించడానికి వెనుకాడదు. జల్సాల కోసం ముగ్గురు యువకులు దారి తప్పి దొంగలుగా మారి చివరికి పోలీసులకు చిక్కారు. వివరాల్లోకి వెళితే.. కోదాడ పట్టణంలో గల మేళచెరువు ఫ్లై ఓవర్ బ్రిడ్జీ పరిసర ప్రాంతాలలో బుధవారం తెల్లవారుజామున పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా మేళచెరువు నుండి రెండు ఆటోలలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా వస్తూ ఉండటంతో, అట్టి ఆటోలను ఆపి సదురు వ్యక్తులను విచారించగా సరైన సమాధానం చెప్పకపోవడంతో, వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు.

విచారణలో.. ముగ్గురం ప్రైవేట్ సెంటర్ నందు టెక్నీషియన్‌గా పని చేస్తున్నామని, తమకు సెల్ టవర్ల పై పూర్తి అవగాహన ఉండడంతో వాటిలోని బ్యాటరీలను దొంగలించి అమ్ముతున్నామని తెలిపారు. మా ముగ్గురితో పాటు మరో ముగ్గురు కలిసి 2019వ సంవత్సరం సెప్టెంబర్ నుంచి కోదాడ రూరల్ మఠంపల్లి, చిలుకూరు, మేళ చెరువు, చింతలపాలెంతో పాటు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ప్రభుత్వ ప్రైవేట్ సెల్ టవర్లలో మొత్తం పది బ్యాటరీలు దొంగతనం చేసినట్లుగా నిందితులు ఒప్పుకున్నారు. దీంతో ముగ్గురుని పోలీసులు అరెస్టు చేసి పలు సెక్షన్ల పై కేసులు నమోదు చేశారు. చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ సీఐ నరసింహారావు, ఎస్ఐ రాంబాబు, చిలుకూరు ఎస్ఐ నాగభూషణం, రూరల్ ఎస్ఐ సైదులు గౌడ్, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ భాస్కరన్, ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ రఘు తెలిపారు.



Next Story