SSC JE పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

by Disha Web Desk 20 |
SSC JE పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
X

దిశ, ఫీచర్స్ : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూనియర్ ఇంజనీర్ పరీక్ష 2024 కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. పరీక్షకు హాజరు అయ్యే అభ్యర్థులు ఏప్రిల్ 18, 2024 రాత్రి 11 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ మార్చి 28 నుంచి అందుబాటులో ఉంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లో పొరపాట్లను 22 ఏప్రిల్ నుండి 23 ఏప్రిల్ వరకు కూడా సవరణలు చేసుకోవచ్చు. SSC అధికారిక వెబ్‌సైట్, ssc.gov.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేయాలి.

జూనియర్ ఇంజనీర్ పరీక్ష కింద మొత్తం 968 JE పోస్టులను కమిషన్ రిక్రూట్ చేస్తుంది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్‌తో సహా అనేక కేంద్ర విభాగాలలో JE ఖాళీ పోస్టుల పై రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. నిర్ణీత చివరి తేదీలోపు అభ్యర్థులు తమ అర్హతను బట్టి దరఖాస్తు చేసుకోవచ్చు.

వివిధ జూనియర్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. దరఖాస్తును సమర్పించే అభ్యర్థి వయస్సు 30 ఏండ్లకు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 ఏళ్లు సడలింపు కల్పించారు.

దరఖాస్తు రుసుము..

SSC JE పరీక్ష 2024కి దరఖాస్తు చేసుకునే జనరల్ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ. 100 చెల్లించాలి. SC, ST వికలాంగ కేటగిరీ దరఖాస్తుదారులు దరఖాస్తు రుసుము చెల్లించనవసరం లేదు.

ఈ దశల్లో అప్లై చేసుకోండి..

SSC ssc.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వండి.

హోమ్ పేజీలో ఇచ్చిన అప్లై ట్యాబ్‌ పై క్లిక్ చేయండి.

తర్వాత వివరాలను నమోదు చేసుకుని, దరఖాస్తు చేయడం ప్రారంభించండి.

అవసరమైన అన్ని వివరాలను పూరించండి. తరువాత పత్రాలను అప్‌లోడ్ చేయండి.

దరఖాస్తు రుసుము చెల్లించి సమర్పించండి.

ఎంపిక ఎలా జరుగుతుంది ?

JE వివిధ పోస్టుల భర్తీకి పేపర్ 1, పేపర్ 2 పరీక్షల ద్వారా ఎంపిక చేయనున్నారు. పేపర్ 1 పరీక్ష జూన్ 4 నుండి 6 వరకు నిర్వహించనున్నారు. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు పేపర్ 2 రాసేందుకు అర్హత సాధిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు రూ. 35,400 నుండి రూ. 1,12,400 మధ్య జీతం లభిస్తుంది.


Next Story

Most Viewed