సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫైనల్ ఆన్సర్ కీ విడుదల... ఫలితాలు ఎప్పుడంటే..

by Disha Web Desk 20 |
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫైనల్ ఆన్సర్ కీ విడుదల... ఫలితాలు ఎప్పుడంటే..
X

దిశ, ఫీచర్స్ : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2024 ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ aissee.nta.nic.inని సందర్శించి తుది సమాధాన కీని తనిఖీ చేయవచ్చు. సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష 28 జనవరి 2024న దేశవ్యాప్తంగా నియమించిన కేంద్రాలలో నిర్వహించారు. 6, 9 తరగతుల్లో ప్రవేశానికి ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించారు.

ఇప్పుడు ఫలితం కూడా త్వరలో వెల్లడికానున్నాయి. మీడియా నివేదికల ప్రకారం ఫలితాలు మార్చి 20 లోపు ప్రకటించనున్నారు. అయితే ఫలితాలను ప్రకటించే అధికారిక తేదీని నేషనల్ ఎగ్జామినేషన్ ఏజెన్సీ విడుదల చేయలేదు. 6వ తరగతి ప్రవేశానికి జనవరి 28న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు. అలాగే 9వ తరగతి ప్రవేశానికి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించారు.

AISSEE 2024 జవాబు కీని ఎలా తనిఖీ చేయాలి ?

అధికారిక వెబ్‌సైట్ nta.ac.inకి వెళ్లండి.

హోమ్ పేజీలో AISSEE 2024 ఫైనల్ ఆన్సర్ కీ లింక్‌ పై క్లిక్ చేయండి.

ఆన్సర్ కీ మీ స్క్రీన్‌ పై PDF రూపంలో కనిపిస్తుంది.

తనిఖీ చేసిన తరువాత డౌన్‌లోడ్ చేసుకోండి.

6వ, 9వ తరగతి అడ్మిషన్ కోసం ప్రతి సంవత్సరం AISSEE పరీక్ష నిర్వహిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 33 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. రక్షణ మంత్రిత్వ శాఖ 19 కొత్త సైనిక్ పాఠశాలలను ఆమోదించింది. ఈ పాఠశాలల్లో 6వ తరగతికి ప్రవేశ పరీక్ష జరుగుతుంది.

ప్రవేశ పరీక్షను పెన్ పేపర్ విధానంలో నిర్వహించారు. పరీక్షలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అడగగా, పరీక్ష OMR షీట్లలో నిర్వహించారు. 6వ తరగతికి సంబంధించి మొత్తం 125 ప్రశ్నలు 300 మార్కులను అడిగారు. 9వ తరగతి ప్రవేశ పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు 400 మార్కులకు అడిగారు. పరీక్షలో మైనస్ మార్కింగ్ అమలు చేయలేదు. పరీక్షను ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ 13 భాషలలో నిర్వహించారు.



Next Story

Most Viewed