JEE Main 2023: పరీక్షల షెడ్యూల్ విడుదల

by Disha Web Desk |
JEE Main 2023: పరీక్షల షెడ్యూల్ విడుదల
X

దిశ, డైనమిక్ బ్యూరో : జేఈఈ మెయిన్‌ 2023 పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మొదటి విడత పరీక్షను జనవరి 18 నుంచి 23(18,19,20,21,22,23) తేదీల మధ్య నిర్వహించనున్నారు. రెండో విడత పరీక్ష ఏప్రిల్ 4-9(4,5,6,7,8,9) తేదీల మధ్య జరగనుంది. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. జేఈఈ మెయిన్స్ పరీక్షల కోసం దరఖాస్తుల గడువును కూడా ప్రకటించారు. అభ్యర్థులు నవంబర్ 16 (రేపటి) నుంచి డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష రెండు షిప్టుల్లో జరగనుంది. మొదటి షిప్టు పరీక్షను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిప్టును సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు నిర్వహించనున్నారు. ప్రశ్న పత్రాలను ఇంగ్లీషు, హిందీతోపాటు తెలుగు తదితర ప్రాంతీయ భాషల్లోనూ రూపొందిస్తారు. జేఈఈ మెయిన్స్‌లో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1 ద్వారా ఇంజనీరింగ్‌(బీఈ, బీటెక్), పేపర్‌-2 ద్వారా ఆర్కిటెక్చర్‌, ప్లానింగ్‌ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. రెండు పేపర్లలోనూ విభాగం-ఎలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. విభాగం-బిలో అన్ని ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. సెక్షన్‌-ఎ, సెక్షన్‌-బి రెండింటికీ నెగెటివ్‌ మార్కులు ఉంటాయి. కాగా, ఈ పరీక్షలకు సంభందించిన వివరాలు, పూర్తి సమాచారం కోసం https://jeemain.nta.nic.in/. లేదా 011-40759000/011-69227700 కు కాల్ లేదా ఈ మెయిల్ ద్వారా సంప్రదించాలని తెలిపారు.

జేఈఈ మెయిన్‌ షెడ్యూల్‌...

దరఖాస్తుగడువు : నవంబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు

సెషన్‌-1 పరీక్ష : జనవరి 18-23తేదీల్లో

సెషన్‌-2 పరీక్ష : ఏప్రిల్ 4-9 తేదీల్లో

ఇవి కూడా చదవండి : అంబేద్కర్ వర్సిటీ బీఎడ్ స్పాట్ అడ్మిషన్స్ వాయిదా



Next Story

Most Viewed