అంతర్రాష్ట్ర జూదరుల ముఠా అరెస్టు..

by  |
అంతర్రాష్ట్ర జూదరుల ముఠా అరెస్టు..
X

దిశప్రతినిధి, ఆదిలాబాద్: అంతర్ రాష్ట్ర జూదరుల ముఠాపై రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. మంచిర్యాల జిల్లా పట్టణ కేంద్రంలోని హై టెక్ సిటీ కాలనీలోని గోనే విద్యాసాగర్ రావు అనే వ్యక్తి ఇంట్లో జూదం (అందర్ బహార్) ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో పట్టణ పోలీసులు, టాస్క్ ఫోర్సు సీఐలు రాజ్ కుమార్, కిరణ్ కుమార్, ఎస్ఐలు షేక్ మస్తాన్, కిరణ్‌ తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఆ సమయంలో జూదం ఆడుతున్న (అందర్ బహార్ ) ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. నిందితుల నుంచి రూ. 2,00,250 స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

పరారీలో ఇద్దరు వ్యక్తులు..

దాడులు నిర్వహించిన సమయంలో జూదం ఆడుతున్న ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, జూదం ఆడించే వారి వివరాలు, ఆట నిర్వహించే ప్రాంతాలు తెలిపే వారి వివరాలు, ఆట జరుగు ప్రాంతానికి తీసుకు వచ్చే వారి వివరాలు విచారణలో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు.

పట్టుబడిన వారి వివరాలు..

1.అన్నల తిరుపతి చెన్నూర్ (జూద నిర్వాహకుడు )
2.ముంబత్తుల శంకర్ @ మేకల మంది శంకర్ వేంపల్లి, హాజీపూర్ (జూదరులకు ఫైనాన్స్ ఇచ్చే వ్యక్తి )
3.గుండపు లక్ష్మీనారాయణ (గొర్రె కాలనీ చెన్నూరు )
4.సేసు సాయి కృష్ణ, (గోపాల వాడ, గాంధీనగర్ మంచిర్యాల )
5.నగవత్ రాజేష్, (పెద్దంపేట, రామగిరి )
6.మాదాడి రాజిరెడ్డి (సూరయ్య పల్లి, మంథని )
7.వేల్పుల పోచం ( మారెమ్మ వాడ, చెన్నూర్ )
ప్రస్తుతం గోనె విద్యాసాగర్ పరారీలో ఉన్నట్లు తేలగా, వీరందరిపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



Next Story

Most Viewed