ఆరేళ్ల బాలికపై దారుణం జరిగితే స్పందించరా ?.. మంత్రిపై ఫైర్

by  |
ఆరేళ్ల బాలికపై దారుణం జరిగితే స్పందించరా ?.. మంత్రిపై ఫైర్
X

దిశ, అశ్వారావుపేట టౌన్: హైదరాబాద్ నగరంలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో లైంగిక దాడి, హత్యకు గురైన ఆరేళ్ల చిన్నారి చైత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆదివారం అశ్వారావుపేటలో దిశ ప్రొటెక్షన్ ఫోర్స్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు వేముల భారతీ మాట్లాడుతూ.. బాలికపై లైంగిక దాడికి పాల్పడి హత్యచేసిన నిందితుడు రాజును బహిరంగంగా ఉరి తీయాలంటూ డిమాండ్ చేశారు.

చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడడం క్షమించరాని నేరమని అటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించకపోతే సమాజంలో మార్పు రాదన్నారు. ఆరేళ్ల బాలికపై దారుణం జరిగితే స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కనీసం స్పందించకపోవడం బాధాకరమని, సభ్య సమాజం తలదించుకునేలా మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు కేవలం కాగితాలకే పరిమితమవుతుందని ఆమె విమర్శించారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ కార్యదర్శి సాధు జ్యోత్స్న భాయ్, అశ్వారావుపేట మండల అధ్యక్షురాలు ఎండి.రెహీనా, ఉపాధ్యక్షురాలు పి.శ్రీలత, కోశాధికారి ఎం.వెంకటమహాలక్ష్మి తో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.



Next Story