ఆ ముగ్గురికి గ్రీన్ సిగ్నల్..!

by  |
ఆ ముగ్గురికి గ్రీన్ సిగ్నల్..!
X

దిశ,వెబ్ డెస్క్:తెలంగాణ కేబినెట్ సమావేశం కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. ఈ సమావేశంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గవర్నర్ కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టు సమాచారం. ఈ మేరకు ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సమావేశం అనంతరం కేబినెట్ సిఫార్సు చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గవర్నర్ కోటా రేసులో గోరేటి వెంకన్న, బస్వరాజు సారయ్య, దయానంద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరంతా రేపే ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed