దేశవ్యాప్తంగా ఈవీ చార్జర్‌ల ఏర్పాటుకు IOCL నుంచి ఆర్డర్ పొందిన జెట్‌వర్క్

by Disha Web Desk 17 |
దేశవ్యాప్తంగా ఈవీ చార్జర్‌ల ఏర్పాటుకు IOCL నుంచి ఆర్డర్ పొందిన జెట్‌వర్క్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం 1,400 కు పైగా ఫాస్ట్ చార్జర్‌లను ఏర్పాటు చేయడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(IOCL) నుండి ఆర్డర్‌ను పొందినట్లు యునికార్న్ కంపెనీ జెట్‌వర్క్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఒప్పందంలో భాగంగా జెట్‌వర్క్ 50-60kW, 100-120kW సామర్థ్యంతో ఈవీ చార్జర్‌లను ఏర్పాటు చేస్తుంది. ఇవి DC డ్యూయల్ గన్ CCS2 DC చార్జర్‌గా ఉంటాయి, వీటితో ఒకేసారి రెండు వాహనాలను చార్జ్ చేయవచ్చు. ఐఓసీ ఈవీ చార్జర్‌ల ఏర్పాటు కోసం టెండర్‌ను విడుదల చేయగా, దీనిలో 40 ఈవీ కంపెనీలు పాల్గొన్నాయి. బిడ్డింగ్ ద్వారా భారతదేశం అంతటా ఈవీ ఫాస్ట్ చార్జర్‌లను ఏర్పాటు చేయడానికి జెట్‌వర్క్ ఆర్డర్ పొందింది. ఈ చార్జింగ్ స్టేషన్‌లు ఐఓసీ అవుట్‌లెట్‌లలో అవసరాన్ని బట్టి ఉంటాయి. ఇవి దేశంలోని ప్రధాన నగరాల్లో ఈజీగా గుర్తించేలా ఏర్పాటవుతాయి. ఈవీ మొబిలిటీని స్వీకరించడాన్ని విస్తృతం చేయడానికి కృషి చేస్తామని జెట్‌వర్క్ రెన్యూవబుల్స్ బిజినెస్ హెడ్ అభయ్ ఆద్య అన్నారు. ఈ కంపెనీ ఇటీవల బంగ్లాదేశ్‌లో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది.


Next Story

Most Viewed