సీనియర్ సిటిజన్ల కోసం సరికొత్త స్టార్టప్.. ప్రారంభోత్సవంలో రతన్ టాటా ఆసక్తికర వ్యాఖ్యలు

by Disha Web |
సీనియర్ సిటిజన్ల కోసం సరికొత్త స్టార్టప్.. ప్రారంభోత్సవంలో రతన్ టాటా ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రతన్ టాటా ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయన గొప్ప పారిశ్రామికవేత్తగా పేరుపొందారు. రతన్ టాటాకు మన దేశంలో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. వారిలో చాలా మంది ఆయన ఐడియాలజీకి ఫ్యాన్స్ అయితే మరి కొందరు అతని సింప్లిటీకి ఫిదా అయ్యుంటారు. అయితే రతన్ టాటా తాజాగా ఓ స్టార్టప్ కంపెనీ 'గుడ్ ఫెలోస్'లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యారు. 'గుడ్ ఫెలోస్' సంస్థను షంతను నాయుడు సీనియర్ సిటిజన్స్‌కు సేవ అందించేందుకు స్థాపించాడు. ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఇప్పుడు రతన్ టాటా ముందుకు రావడం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా టాటా ఈ సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా టాటా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఒంటరిగా జీవితం గడపడం, ఓ తోడు కోసం ఎదురుచూడటం ఎలా ఉంటుందో మీకు తెలీదు' అని అన్నారు. అంతేకాకుండా తాము వృద్ధులు అయ్యేవరకు ఎవరూ కూడా వృద్ధాప్యం గురించి పట్టించుకోరు అని రతన్ టాటా అన్నారు.

వికలాంగులకు ఉచితంగా డోర్ స్టెప్ సేవలందించనున్న ఎస్‌బీఐ!


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed