‘ఛాట్ జీపీటీ’ సృష్టికర్త ఆల్ట్‌మాన్ ఎక్కువగా వాడే యాప్ ఇదే

by Dishanational4 |
‘ఛాట్ జీపీటీ’ సృష్టికర్త ఆల్ట్‌మాన్ ఎక్కువగా వాడే యాప్ ఇదే
X

దిశ, నేషనల్ బ్యూరో : ఛాట్ జీపీటీని తయారుచేసిన ఓపెన్ ఏఐ కంపెనీ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ తాను ఎక్కువగా వాడే యాప్ ఏదో వెల్లడించారు. మీరు ఆ యాప్ ఛాట్ జీపీటీయే అయి ఉంటుందని అనుకుంటే పొరపడ్డట్టే. అది ఛాట్ జీపీటీ కాదు. సేల్స్‌ఫోర్స్ కంపెనీ రూపొందించిన టీమ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్ ‘స్లాక్’‌ను తాను ప్రతిరోజూ ఎక్కువసేపు వాడుతానని ఆల్ట్‌మాన్ అంటున్నారు. తాను ఎక్కువగా వాడే యాప్‌లలో సెకండ్ ప్లేస్‌లో ఐమెసేజ్(iMessage) ఉంటుందని తెలిపారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌‌తో జరిగిన ‘అన్‌కన్‌ఫ్యూజ్ మి’ పోడ్‌కాస్ట్‌ కార్యక్రమంలో ఈవిషయాన్ని సామ్ ఆల్ట్‌మాన్ చెప్పారు. తమ ఫోన్‌లలో ఎక్కువగా ఉపయోగించే యాప్‌ల గురించి వీరిద్దరు చర్చించారు. ‘‘ఈమెయిల్ కంటే స్లాక్‌ యాప్‌నే ఎక్కువగా ఉపయోగిస్తారా ?’’ అని బిల్‌గేట్స్ అడిగిన ప్రశ్నకు సామ్ ఆల్ట్‌మాన్ బదులిస్తూ.. ‘‘ఈమెయిల్ కంటే స్లాక్‌ యాప్‌నే చాలా ఎక్కువగా వాడుతాను. iMessages యాప్ కూడా బాగానే వాడుతుంటా’’ అని చెప్పారు. ఛాట్ జీపీటీలో మైక్రోసాఫ్ట్ యజమాని బిల్‌గేట్స్‌కు పెద్దసంఖ్యలో వాటాలున్న సంగతి తెలిసిందే.



Next Story