ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంచిన యూనియన్ బ్యాంక్

by Disha Web Desk 16 |
ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంచిన యూనియన్ బ్యాంక్
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ)లపై వడ్డీ రేట్లను పెంచింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ బ్యాంకు రేట్లను సవరించింది. సవరించిన రేట్లు బుధవారం(డిసెంబర్ 27) నుంచే అమల్లోకి వస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది.

తాజా వివరాల ప్రకారం బ్యాంకు 7 రోజుల నుంచి 45 రోజుల కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై 3 శాతం వడ్డీ ఇస్తుండగా 46-90 రోజులకు 4.05 శాతం, 91-120 రోజులకు 4.3 శాతం, 120-180 రోజులకు 4.4 శాతం, 181 రోజుల నుంచి ఏడాది కాలానికి 5.25 శాతం, ఏడాది నుంచి 398 రోజులకు 6.75 శాతం, 399 రోజులకు గరిష్ఠంగా 7.25 శాతం, 2 ఏళ్ల నుంచి 10 ఏళ్ల డిపాజిట్లకు 6.5 శాతం వడ్డీ అమలు కానుంది. అన్ని కాల వ్యవధులపై సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది. అలాగే, సూపర్ సీనియర్ సిటిజన్లు అదనంగా 0.75 శాతం వడ్డీ పొందుతారు.


Next Story

Most Viewed