పాల ధరలను లీటరుకు రూ.3 పెంచిన ప్రభుత్వం..!

by Disha Web |
పాల ధరలను లీటరుకు రూ.3 పెంచిన ప్రభుత్వం..!
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత రోజున పాల ధరలు ప్రభుత్వం పెంచింది. అమూల్ బ్రాండ్‌కు ప్రసిద్ధి చెందిన గుజరాత్ కో ఆపరేటీవ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లీటరు పాల ధరను లీటరుకు రూ.3 పెంచింది. దీంతో ప్రస్తుతం లీటర్ పాల ధర రూ. 66 కు చేరుకుంది. గతంలో పాల ధర లీటరుకు రూ.63 ఉండేది. అమూల్ ఆవు పాలు లీటరుకు రూ. 54 ఉండగా.. ఎ2 గేదె పాలు లీటరుకు రూ.70కి అందుబాటులో ఉన్నాయి. ఈ విషయాన్ని కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ నివేదించింది.

ఇవి కూడా చదవండి : మరోసారి పెరిగిన అమూల్ పాల ధరలు
Next Story

Most Viewed