రూ.2 వేల నోట్లు తీసుకునే ప్రసక్తే లేదు!

by Disha Web Desk 2 |
రూ.2 వేల నోట్లు తీసుకునే ప్రసక్తే లేదు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2 వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో ఈ నోట్లు కలిగి ఉన్న ప్రజలు వాటిని మార్చుకునేందుకు బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ నోట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ ప్రకటించినప్పటికీ వ్యాపారులు మాత్రం ఈనోట్లను తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో రూ.2 వేల నోట్లు తీసుకోబడవు అని బోర్డులు దర్శనమిస్తున్నాయి. మిగతా వ్యాపారులు సైతం ఈ నోట్లను తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో అడపాదడపా ఈ నోట్లు కలిగి ఉన్న సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు ఇన్నాళ్లు చూద్దామన్నా కనిపించని రూ.2 వేల నోట్లు ఇప్పుడు ఏటీఎంలలో దర్శనం ఇస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో క్యాష్ విత్ డ్రా కోసం వెళ్తే ఏటీఎంల నుంచి రూ.2 వేల నోట్లు రావడం ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. ఇన్నాళ్లు ఏటీఎంలలో కనిపించని ఈ నోట్లు ఆర్బీఐ ప్రకటనతో ఒక్కసారిగా బయటకు వస్తుండటం ఆసక్తిగా మారింది.

Also Read..

64% క్షీణించిన దివీస్ లేబొరేటరీస్ లాభం

Next Story

Most Viewed