China's economy: 'వాకింగ్ జిడిపి' అంటే ఏమిటి? చైనా ఎందుకు దానిపై దృష్టి పెడుతోంది?

by Vennela |

Taylor Swift Concert China: చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ కచేరీ నిర్వహించేందుకు ప్రయత్నిస్తోంది.

Chinas economy: వాకింగ్ జిడిపి అంటే ఏమిటి? చైనా ఎందుకు దానిపై దృష్టి పెడుతోంది?
X

దిశ, వెబ్ డెస్క్: Taylor Swift Concert China: చైనా ప్రస్తుతం ఆర్ధికంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. జనాభా, ఆర్థిక సమస్యలు చైనాను పేలవడానికి సిద్ధంగా ఉన్న టైం బాంబులా మార్చేశాయి. చైనాతోపాటు దాని మిత్ర దేశాలతో సంబంధాలు దెబ్బతినడం వంటి అంశాలు వాణిజ్యం, విదేశీ పెట్టుబడులను ప్రమాదంలో నెట్టేస్తున్నాయి. దీంతో ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం కొత్త పద్ధతులను అవలంబిస్తోంది. దేశ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రపంచ సెలబ్రిటీలను సైతం సంప్రదిస్తోంది. ఎందుకంటే చైనాలో ప్రస్తుతం పరిస్థితి దారుణంగా ఉంది. ప్రజలు డబ్బు ఖర్చు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకర్శించేందుకు ఏదైనా వినూత్న కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (SCMP)తెలిపిన ప్రకారం..స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచేందుకు ప్రముఖులతో సంగీత కచేరీలు నిర్వహించాలని చైనాలోని పెద్ద నగరాలు పట్టుబడుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించినట్లయితే అధిక సంఖ్యలు ప్రజలు ఇందులో భాగస్వామ్యం అవుతారు. దీని ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుందని భావిస్తోంది. దీనిలో భాగంగానే సంగీత కచేరీ కోసం షాంఘై అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ తో సంప్రదింపులు జరుపుతోందట. ప్రజల ఆకట్టుకునేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. షాంఘై అధికారులు టేలర్ స్విఫ్ట్ కచేరీ నిర్వహిస్తే ఈ కచేరీకి భారీ ఎత్తు ప్రజలు తరలివస్తారని ప్రభుత్వం భావిస్తోంది. జనాల నుంచి భారీగా డబ్బును వసూలు చేయవచ్చని ప్రభుత్వం భావన.

గత ఏడాది జూలైలో, షాంఘై స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచడానికి నగరంలో టాప్ స్టార్ ఈవెంట్‌లను నిర్వహించాలనుకుంటున్నట్లు ఒక కథనంలో తెలిపింది. అంతర్జాతీయ కళాకారులపై ఆంక్షలను సడలించాలని ప్రభుత్వాన్ని కోరారు. టేలర్ స్విఫ్ట్ వంటి సూపర్ స్టార్లు స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వగల 'జిడిపిని కదిలిస్తున్నారని'వారు తెలిపారు. చైనా ఆర్థిక రాజధాని అయిన షాంఘై, ఆర్థిక వ్యవస్థను పెంచడానికి ఇటీవలి సంవత్సరాలలో అనేక పెద్ద వాణిజ్య కార్యక్రమాలను నిర్వహించింది. కానీ పెద్ద స్టార్లు లేకపోవడం వల్ల, వాటికి అంతగా స్పందన రాలేదు. ఈ కారణంగా, ఇప్పుడు టేలర్ స్విఫ్ట్ వంటి అంతర్జాతీయ తారలతో చర్చలు జరుపుతున్నారు.టేలర్ స్విఫ్ట్ వంటి ప్రముఖ కళాకారులు అయితే ఎక్కువ మందిని ఆకర్షించవచ్చని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. SCMP నివేదిక ప్రకారం, చైనాలో 'ప్రదర్శనల కోసం ప్రయాణం' అనే కొత్త ట్రెండ్‌లో కచేరీ నిర్వహించాలనే స్విఫ్ట్ ఆలోచన వచ్చింది. ఇక్కడ అభిమానులు, ముఖ్యంగా యువకులు పెద్ద కచేరీలు లేదా ప్రదర్శనల కోసం ఇతర నగరాలకు వెళ్తుంటారు. దీంతో పర్యాటకం ద్వారా మరింత డబ్బు పోగు చేయోచ్చని అక్కడి సర్కార్ భావిస్తోంది.

అయితే విదేశీ కళాకారులు పాల్గొనే భారీ-స్థాయి ఈవెంట్‌లకు పర్మిషన్ ఇవ్వడం పట్ల చైనా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పుడు షాంఘై వంటి నగరాల నుండి అలాంటి ఈవెంట్‌ల కోసం నిబంధనలను సడలించాలని అభ్యర్థిస్తున్నాయి. షాంఘై స్థానిక ప్రభుత్వం వీసా, కస్టమ్స్ సంబంధిత సవాళ్లను అధిగమించడానికి త్వరగా పని చేయాలని కోరింది. తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈవెంట్‌లను నిర్వహించవచ్చని తెలిపింది.

కాగా స్విఫ్ట్ $2 బిలియన్ ఎరాస్ టూర్ చరిత్ర సృష్టించింది. 2 సంవత్సరాల సుదీర్ఘ పర్యటన డిసెంబర్ 2024లో కెనడాలోని వాంకోవర్‌లో ఒక ప్రదర్శనతో ముగిసింది. ఈ రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 149 షోలు జరిగాయి. ఒక్కో షోకి సగటున $13.9 మిలియన్ (రూ. 1,20,34,83,545) కంటే ఎక్కువ సంపాదించింది. టేలర్ స్విఫ్ట్ ప్రసిద్ధ బ్యాండ్ కోల్డ్‌ప్లే 'మ్యూజిక్ ఆఫ్ ది స్పియర్స్' పర్యటన మునుపటి రికార్డును బద్దలు కొట్టింది. ఇది దాదాపు 1 బిలియన్ డాలర్లను ఆర్జించింది. షాంఘైలో టేలర్ స్విఫ్ట్ సంగీత కచేరీని నిర్వహించాలని చైనా ప్రభుత్వం కోరుకోవడానికి ఇదే కారణం. ఈ కార్యక్రమం స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story