Tata Play Binge: రూ. 349కే 26 OTT యాప్స్

by Disha Web Desk 17 |
Tata Play Binge: రూ. 349కే 26 OTT యాప్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలి కాలంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు ఆదరణ విపరీతంగా పెరగడంతో పలు కంపెనీలు పోటా పోటీగా తక్కువ ధరలో ఓటీటీ యాప్స్‌లను అందిస్తున్నాయి. అన్ని యాప్‌లు కూడా వేరువేరు కంటెంట్‌లను విడిగా అందిస్తున్నాయి. అయితే ఇలాంటి OTT యాప్‌లను Tata Play Binge ఒకే చోటుకు తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 26 వరకు ప్రముఖ OTT యాప్స్ అన్నింటినీ ఒకే వేదికపై అందిస్తుంది ‘టాటా ప్లే బింజ్’. దీంతో సింగిల్ సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా 26 OTT యాప్స్‌లోని సినిమాలు, స్పోర్ట్స్, వెబ్ సిరీస్‌లు, టీవీ షోస్, పలు సీరియల్స్ మొదలగు వాటిని చూడవచ్చు.

టాటా ప్లే బింజ్ ‌లో నెలవారీ ప్లాన్లు రూ.199 నుంచే మొదలు కానున్నాయి. ఈ సేవలు పొందడానికి ప్రత్యేకంగా టాటా ప్లే డీటీహెచ్ అవసరం లేదు. కేవలం టాటా ప్లే బింజ్ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని వీటిని వీక్షించవచ్చు. 26 ఓటీటీ యాప్స్ కలిగి ఉన్న నెలవారీ ప్లాన్ ధర రూ.349గా ఉంది. అదే 24 ఓటీటీ యాప్స్‌తో వస్తున్న ప్లాన్ ధర రూ.249, 20 ఓటీటీ యాప్స్ ప్లాన్ ధర రూ.199 గా ఉంది. రూ.349 ప్లాన్‌ను 3 నెలల సబ్‌స్క్రిప్షన్ కోసం తీసుకుంటే రూ.989 చెల్లించాలి. అదే ఏడాదికి అయితే రూ.3839 చెల్లించాలి.



TV, ల్యాప్‌టాప్, మొబైల్ ఎక్కడైనా సరే ఈ ఓటీటీ కంటెంట్‌లను చూసే వీలు ఉంటుంది. అమెజాన్ ఫైర్ స్టిక్, ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ, టాటా ప్లే బింజ్ సెటప్ బాక్స్ ద్వారా టీవీల్లో చూడవచ్చు. వీటిలో MX Player, సోనీ లివ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, Zee 5, సన్ నెక్ట్స్, ఆహా, ఈరోస్ నౌ, హంగామా, వూట్ వంటి యాప్స్ ఉన్నాయి. అయితే ఎక్కువగా వీక్షించే అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ యాప్స్ మాత్రం అందుబాటులో లేవు.

Next Story