Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్.. 200 పాయింట్ల మేర పతనమైన సెన్సెక్స్..!

by Maddikunta Saikiran |

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ వారాన్ని నష్టాలతో స్టార్ట్ చేశాయి.

Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్.. 200 పాయింట్ల మేర పతనమైన సెన్సెక్స్..!
X

దిశ, వెబ్‌‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ వారాన్ని నష్టాలతో స్టార్ట్ చేశాయి. ఆసియా మార్కెట్ల(Asian Markets) నుంచి మిక్స్డ్ సిగ్నల్స్ రావడం, వెస్ట్ ఆసియా(West Asia)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు వంటివి మార్కెట్ నష్టాలకు కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ రోజు ఎఫ్‌ఎంసీజీ(FMCG) రంగం షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించడంతో మన బెంచ్ మార్క్ సూచీలు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌(Sensex) ఉదయం 81,602.58 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరివరకు ఒడుదొడుకులను ఎదుర్కొంది. ఇంట్రాడేలో 81,411.55 - 81,783.28 పాయింట్ల మధ్య కదలాడి చివరికి 200.66 పాయింట్ల నష్టంతో 81,508.46 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ(Nifty) 58.80 పాయింట్లు నష్టంతో 24,619 వద్ద స్థిరపడింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 71.93 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ స్వల్పంగా తగ్గి 84.74కి చేరుకుంది.

లాభాల్లో ముగిసిన షేర్లు: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, ఎల్&టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్

నష్టాల్లో ముగిసిన షేర్లు: నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, హిందుస్థాన్ యూనీలీవర్, యాక్సిస్ బ్యాంక్

Next Story