గ్రీన్ స్టీల్‌ తయారీ దిశగా ఉత్పత్తిదారులు: క్రిసిల్

by Disha Web Desk 17 |
గ్రీన్ స్టీల్‌ తయారీ దిశగా ఉత్పత్తిదారులు: క్రిసిల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఉక్కు తయారీదారులు 2030 నాటికి ముడి ఉక్కు నుంచి వచ్చే కార్బన్ ఉద్గారాలను 2 టన్నుల కంటే తక్కువకు తగ్గించాలనే లక్ష్యాన్ని చేరుకోబోతున్నారని క్రెడిట్ రేటింగ్ సంస్థ క్రెసిల్ అంచనా వేసింది. దీని ద్వారా గ్రీన్ స్టీల్ తయారీకి ఊతం వచ్చే అవకాశం ఉంది. ఉద్గారాలను తగ్గించడం ద్వారా నిధుల సేకరణ మెరుగై, ఎగుమతుల పోటీ వాతావరణం మరింత విస్తృతం అవుతుంది. గత ఆర్థిక సంవత్సరం నాటికి ఉక్కు తయారీదారులు నివేదించిన కార్బన్ ఉద్గారాలు 2005 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 3 టన్నుల మేర తగ్గాయి. ఇది అనుకున్న లక్ష్యంలో 65 శాతానికి చేరుకుందని క్రెసిల్ పేర్కొంది.

బొగ్గు ఆధారంగా పనిచేసే ఉక్కు తయారీ సంస్థలు తమ కాలుష్య ఉద్గారాలను తగ్గించి ఉక్కును ఉత్పత్తి చేయడానికి హైడ్రోజన్, కోల్ గ్యాసిఫికేషన్ లేదా విద్యుత్ వంటి తక్కువ కార్బన్ శక్తి వనరులను ఉపయోగించాలని చూస్తున్నాయి. 2030 నాటికి తమ లక్ష్యాన్ని చేరడానికి ఇప్పటికే కొన్ని సంస్థలు కార్యచరణను మొదలుపెట్టాయి. క్రెసిల్ రేటింగ్స్ డైరెక్టర్ అంకిత్ హఖు మాట్లాడుతూ, ఉద్గారాల తగ్గింపు కారణంగా భవిష్యత్తలో గ్రీన్ స్టీల్‌ తయారీ ఊతం వస్తుంది. ఇది తక్కువ మూలధన వ్యయం, సుదీర్ఘ కాల వ్యవధి కలిగిన స్థిరమైన ఫైనాన్స్ వంటి అదనపు నిధుల మార్గాలకు అవకాశాలను మెరుగుపరుస్తుందని అన్నారు.


Next Story

Most Viewed