ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడానికి రూ. 2 వేల కోట్ల వేటలో SpiceJet!

by Disha Web Desk 17 |
ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడానికి రూ. 2 వేల కోట్ల వేటలో SpiceJet!
X

న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ నిధుల వేట మొదలుపెట్టింది. ఇతర విమానయాన సంస్థలతో పాటు ఇతర మార్గాల ద్వారా రూ. 2,000 కోట్ల వరకు నిధులు సమీకరించేందుకు అవకాశాలను వెతుకుతున్నట్టు స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ మేరకు పరిశ్రమల సంస్థ అసోచామ్ నిర్వహించిన కార్యక్రమంలో సీఎండీ చెప్పారు. అయితే, రూ. 2,000 కోట్ల వరకు సేకరించేందుకు సంస్థలో ఎంత వాటాను విక్రయించనున్నారనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఇటీవల స్పైస్‌జెట్ సంస్థ తన మొత్తం విమానాల్లో 50 శాతానికి మించి కార్యకలాపాలను నిర్వహించకూడదని విమానయాన రంగ రెగ్యులేటర్ డీజీసీఏ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

వరుస సంఘటనల్లో స్పైస్‌జెట్ విమానాలు లోపాలను ఎదుర్కొన్న కారణంగా డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. స్పైస్‌జెట్ గత నాలుగేళ్లుగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, కరోనా మహమ్మారితో కష్టాలు ఇంకా పెరిగాయి.

Next Story

Most Viewed