రూ.20 వేలలోపు ధరలో అమెజాన్‌లో లభిస్తున్న స్మార్ట్‌టీవీలు!

by Disha Web Desk 17 |
రూ.20 వేలలోపు ధరలో అమెజాన్‌లో లభిస్తున్న స్మార్ట్‌టీవీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023లో భాగంగా పలు స్మార్ట్‌టీవీలపై భారీ తగ్గింపులు ఉన్నాయి. ఎంపిక చేసిన టీవీలపై ఎన్నడు లేని తగ్గింపులతో పాటు నో-కాస్ట్ EMI ఆప్షన్లు, పలు రివార్డులు లభిస్తున్నాయి. రూ.20,000 లోపు ధరలో కొన్ని స్మార్ట్‌టీవీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటిని కొనుగోలు చేసే సమయంలో SBI కార్డులను ఉపయోగించినట్లయితే అదనంగా 10 శాతం తగ్గింపు కూడా పొందవచ్చు. అమెజాన్ సేల్‌లో రూ.20 వేల కంటే తక్కువ ధరలో లభిస్తున్న కొన్ని స్మార్ట్‌టీవీలు ఇవే..

OnePlus కంపెనీ తన 32-అంగుళాల Y-సిరీస్ HD Android TV (32Y1)ని అతి తక్కువ ధరకు అంటే రూ.12,499కు అందిస్తుంది. దీని అసలు ధర రూ.19,999. ఈ టీవీ 1366x768 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 9 అవుట్ ది బాక్స్‌లో రన్ అవుతుంది. OnePlus Connect, Chromecast, ఇతర అనేక యాప్‌ల సపోర్ట్ ఉంటుంది. ఇది డాల్బీ ఆడియోతో 20W స్పీకర్లను కలిగి ఉంది. దీనికి 2 HDMI పోర్ట్‌లు, 2 USB పోర్ట్‌లను అమర్చారు.

Samsung 32 అంగుళాల HD రెడీ LED Smart TV ని రూ.11,990 కే కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.22,900. ఇది 60 Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. Netflix, Prime Video, Zee5, SonyLiv, Youtube, Hotstar వంటి పలు యాప్‌లకు సపోర్ట్ ఇస్తుంది.1366x768 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ కలిగి ఉంది. 20 వాట్స్ అవుట్‌పుట్‌తో డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్ సిస్టంను అందించారు. ‎Tizen ఆపరేటింగ్ సిస్టం ద్వారా పనిచేస్తుంది.

వెస్టింగ్‌హౌస్ 43-అంగుళాల LED స్మార్ట్ టీవీ అసలు ధర రూ.20,999. కానీ ఈ సేల్‌లో దీన్ని రూ.14,499కే కొనుగోలు చేయవచ్చు. ఇది FULL-HD (1,920x1,080 పిక్సెల్‌లు) DLED ప్యానెల్‌ను కలిగి ఉంది. 178-డిగ్రీల నుంచి చూసిన కూడా పిక్చర్ క్లియర్‌గా కనిపిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది ఆండ్రాయిడ్ 9 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ అవుతుంది. Google Play స్టోర్‌ ద్వారా యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనిలో 30W స్పీకర్‌లను అందించారు.

Redmi 8 -32 అంగుళాల F Series HD Ready Smart LED Fire TVని అమెజాన్‌ సేల్‌లో రూ.8,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ టీవీ 720p(‎1366 x 768) పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. Netflix, Prime Video, Disney+ Hotstar వంటి 12000+ యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది. ‎FireOS ఆపరేటింగ్ సిస్టం ద్వారా పనిచేస్తుంది. 20 W సౌండ్‌ను అందించారు. Dolby ఆడియోకు సపోర్ట్ చేస్తుంది.

Next Story

Most Viewed