ఎట్టకేలకు తొలి ఈవీ స్కూటర్‌ను విడుదల చేసిన సింపుల్ ఎనర్జీ!

by Disha Web Desk 23 |
ఎట్టకేలకు తొలి ఈవీ స్కూటర్‌ను విడుదల చేసిన సింపుల్ ఎనర్జీ!
X

బెంగళూరు: బెంగళూరు కేంద్రంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల స్టార్టప్ సింపుల్ ఎనర్జీ మంగళవారం తన తొలి ఈవీ స్కూటర్ సింపుల్ వన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో సింపుల్ వన్‌ను ఆవిష్కరించిన దాదాపు 21 నెలల తర్వాత విడుదల చేయడం గమనార్హం. రూ. 1.45 లక్షల ప్రారంభ ధరతో ఈవీ స్కూటర్‌ను తీసుకొచ్చిన కంపెనీ 750వాట్ల ఛార్జర్‌తో వచ్చే స్కూటర్ వేరియంట్ ధర రూ. 1.58 లక్షలకు అందుబాటులో ఉంటుందని సింపుల్ ఎనర్జీ పేర్కొంది. రానున్న కొద్దిరోజుల్లో డెలివరీలను ప్రారంభిస్తామని, వచ్చే 12 నెలల్లో 40-50 నగరాల్లో 160-180 రిటైల్ స్టోర్లకు కార్యకలాపాలను విస్తరించడంపై దృష్టి సారిస్తున్నామని కంపెనీ వెల్లడించింది.

వినియోగదారులకు అత్యాధునిక టెక్నాలజీ, సురక్షితమైన డ్రైవింగ్ సౌకర్యాలను అందించేందుకే ఎక్కువకాలం పాటు టెస్ట్ డ్రైవ్ నిర్వహించి మార్కెట్లోకి విడుదల చేశామని కంప్నీఎ వివరించింది. 2021, ఆగష్టు 15న కంపెనీ సింపుల్ వన్ ఈవీని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. సింపుల్ వన్ ఈవీ స్కూటర్ కోసం కంపెనీ చాలా సమయంతో పాటు పెట్టుబడిని కూడా పెట్టింది. ఎక్కువ దూరం, స్మార్ట్, ఫాస్ట్ టెక్నాలజీ, డ్యూయెల్ బ్యాటరీ వంటి అంశాలు సింపుల్ వన్ స్కూటర్ ప్రత్యేకతలని, 95 శాతం పరికరాలను స్థానికంగానే సమకూర్చుకున్నామని సింపుల్ ఎనర్జీ సీఈఓ సుహాస్ రాజ్‌కుమార్ తెలిపారు. 0-80 శాతం ఛార్జింగ్ కోసం దాదాపు 6 గంటల సమయం పడుతుందని, ఒకసారి ఛార్జింగ్ చేశాక 212 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది.

Also Read..

స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న లాభాలు!


Next Story

Most Viewed