కారు కొనేటప్పుడు కస్టమర్ల ఫొటో తీయడానికి కారణమేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Disha Web Desk 6 |
కారు కొనేటప్పుడు కస్టమర్ల ఫొటో తీయడానికి కారణమేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల సెల్‌ఫోన్ వచ్చిన కానుంచి చాలా మంది ఏదైనా వస్తువును కొనుగోలు చేసిన ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఫొటోలు తీసుకోవడం కామన్ అయిపోయింది. అలాగే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేస్తుంటారు. అయితే ముఖ్యంగా కారు కొన్నప్పుడు షోరూమ్ వాళ్లే ఫొటో తీసుకుంటారు. కారు ముందు కస్టమర్‌ను నిల్చో బెట్టి వారి చేతికి ఓ పెద్ద తాళం ఇచ్చి ఫొటో దింపుతారు. ఆ తర్వాతే కారును అప్పగిస్తారు. అలా ఎందుకు చేస్తారని చాలా మందిలో అనుమానం ఉండొచ్చు. అయితే వారు అలా చేయడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయట. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

అలా ఫొటో తీసుకోవడం వల్ల కారు కొనడానికి తీసుకున్న నిర్ణయం సరైనదని ఆ సమయం గుర్తుండి పోవాలని పెద్ద తాళం తో ఫొటో తీస్తారు. అలాగే భారీగా పెట్టుబడి పెడతారు దాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలని అందరూ అనుకుంటారు. వారి ఉత్సాహం ఎంతలా ఉందో తెలపడానికి ఈ ఫొటోను తీస్తారు. అయితే పెద్ద కీలో ఈ బ్రాండ్ పేరుతో పాటు లోగో కూడా ఉంటుంది. దీంతో వినియోగదారులు దాన్ని చూసుకొని మురిసిపోతూ జ్ఞాపకంగా వారితో పదిలంగా దాచుకుంటారు. అలాగే ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తే కంపెనీ వారికి భారీగా ప్రమేషన్స్ చేసినట్లు అవుతుంది. దీంతో వారికి ఏ కష్టం లేకుండా వారి బ్రాండ్ గురించి అందరికీ తెలుస్తుంది. దీన్ని నమ్మి కారు కొన్న వారికి తెలిసిన వారు కూడా ఆ బ్రాండ్ కారునే కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Next Story

Most Viewed