- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Stock Market: 83 వేల పైన ముగిసిన సెన్సెక్స్
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలను కొనసాగిస్తున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపునకు సంబంధించి సమావేశం మొదలవడం, దేశీయంగా కీలక బ్లూచిప్ స్టాక్స్‌లో కొనుగోళ్లతో సూచీలు మిడ్-సెషన్ సమయం నుంచి స్థిరంగా లాభాల్లో ట్రేడయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో లాభాల స్వీకరణ, బలహీన ధోరణి ఉన్నప్పటికీ దేశీయ సూచీల్లో ర్యాలీ సానుకూలంగా కొనసాగింది. ఈ క్రమంలోనే సెన్సెక్స్ ఇండెక్స్ 83,000 మార్కును దాటింది. నిఫ్టీ కూడా 25,400 పాయింట్లను అధిగమించి కొత్త గరిష్ఠాల వద్ద స్థిరపడింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 90.88 పాయింట్లు లాభపడి 83,079 వద్ద, నిఫ్టీ 34.80 పాయింట్ల లాభంతో 25,418 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో, ప్రైవేట్ బ్యాంక్, ఐటీ, మీడియా రంగాలు రాణించగా, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్ నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, ఎన్‌టీపీసీ, ఎంఅండ్ఎం, టైటాన్, ఎల్అండ్‌టీ, కోటక్ బ్యాంక్ షేర్లు లాభాలను సాధించాయి. టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, ఐటీసీ, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.78 వద్ద ఉంది.