SEBI: ఏఐ రిస్క్‌లపై సెబీ అలర్ట్

by S Gopi |

తదుపరి తరం ఏఐ మోడళ్లు మార్కెట్ వ్యవస్థను సమర్థవంతంగా మారుస్తున్నప్పటికీ, అవి వ్యవస్థలోని బలహీనతలను వేగంగా గుర్తించి దుర్వినియోగం చేసే అవకాశాన్ని కూడా పెంచుతున్నాయి.

SEBI: ఏఐ రిస్క్‌లపై సెబీ అలర్ట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత క్యాపిటల్ మార్కెట్లలో వేగంగా పెరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగం కొత్త అవకాశాలను అందించడమే కాకుండా, కొత్త ప్రమాదాలను కూడా సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ త్వరలో ఏఐ ఆధారిత రిస్క్‌లపై మార్కెట్ మధ్యవర్తులకు అడ్వైజరీని విడుదల చేస్తుందని ఛైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. ఐఎంసీ క్యాపిటల్ మార్కెట్స్ కాన్ఫరెన్స్ 2026లో మాట్లాడిన ఆయన.. తదుపరి తరం ఏఐ మోడళ్లు మార్కెట్ వ్యవస్థను సమర్థవంతంగా మారుస్తున్నప్పటికీ, అవి వ్యవస్థలోని బలహీనతలను వేగంగా గుర్తించి దుర్వినియోగం చేసే అవకాశాన్ని కూడా పెంచుతున్నాయి. ముఖ్యంగా పరస్పరం అనుసంధానంగా ఉన్న మార్కెట్లలో, ఒక చిన్న లోపం కూడా చైన్ రియాక్షన్‌లా వ్యాప్తి చెంది పెద్ద నష్టాలకు దారితీయవచ్చని తుహిన్ కాంత పాండే అభిప్రాయపడ్డారు. కాబట్టి నియంత్రణపైనే కాకుండా, ‘ప్రొయాక్టివ్ రెడీనెస్’పై సెబీ దృష్టి సారిస్తోందన్నారు. మార్కెట్ మధ్యవర్తులు, సంస్థలు తమ సైబర్ భద్రతను ముందుగానే బలోపేతం చేయాలి, నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలను అమలు చేయాలి, లోపాలు గుర్తించిన వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

Next Story