అత్యంత తక్కువ సమర్థవంతమైన బ్యాంకుగా ఎస్‌బీఐ!

by Disha Web Desk 17 |
అత్యంత తక్కువ సమర్థవంతమైన బ్యాంకుగా ఎస్‌బీఐ!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఆసియా-పసిఫిక్‌లోనే అత్యంత తక్కువ సమర్థవంతమైన బ్యాంకుగా మారింది. ప్రముఖ పరిశోధనా సంస్థ ఎస్అండ్‌పీ గ్లోబల్ తాజా నివేదిక ప్రకారం, జూన్ త్రైమాసికంలో ఎస్‌బీఐ పెట్టుబడులు నష్టాలను ఎదుర్కొన్న కారణంగా ఖర్చులు, ఆదాయ నిష్పత్తి ఏడాదికి 911 బేసిస్ పాయింట్లు పెరిగి 71.06 శాతానికి చేరుకుంది.

ఖర్చులు, ఆదాయ నిష్పత్తి అనేది బ్యాంకుల లాభదాయకతను సూచిస్తుంది. అంటే, అధిక నిష్పత్తి ఎక్కువ ఖర్చులు, తక్కువ లాభదాయకతకు సమానం. ఈ జాబితాలో, దేశీయ ఇతర బ్యాంకులైన ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు మెరుగైన ఖర్చులు, ఆదాయ నిష్పత్తిని నమోదు చేశాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖర్చులు, ఆదాయ నిష్పత్తి 35.23 శాతం నుంచి 40.78 శాతానికి పెరగ్గా, ఐసీఐసీఐ బ్యాంక్ 62.45 శాతం నుంచి 60.01 శాతానికి తగ్గింది.

మార్కెట్ బలహీనత వల్ల చాలా భారతీయ బ్యాంకులు తమ పెట్టుబడుల్లో నష్టాలను చూస్తున్నాయని నివేదిక అభిప్రాయపడింది. 2022-23 మొదటి త్రైమాసికంలో వడ్డీ రేట్లు పెరగడం వల్ల భారత బ్యాంకుల వడ్డీయేతర ఆదాయం ప్రభావితమైందని ఎస్అండ్‌పీ గ్లోబల్ అనుబంధ సంస్థ క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ అన్నారు.


Next Story

Most Viewed