దద్దరిల్లిన దీపావళి సేల్స్.. ప్రజలు ఎన్ని వందల కోట్లు ఖర్చు చేశారంటే..?

by Disha Web Desk |
దద్దరిల్లిన దీపావళి సేల్స్.. ప్రజలు ఎన్ని వందల కోట్లు ఖర్చు చేశారంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏ పండుగలు వచ్చినా ఖర్చులు భారీగానే ఉంటాయి. కానీ అన్ని పండుగలు వేరు దీపావళి వేరు. ఏ పండుగ అయినా అది కొంతమందికే పరిమితం ఉంటుంది. మతాల వారిగా, కులాల వారిగా జరుపుకునే పండుగలు ఉంటాయి. కానీ దీపావళి ఒక్కటే అందరూ సమానంగా జరుపుకుంటారు. కుల, మత, ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉన్నంతలో ధూమ్ ధామ్ సెలబ్రేట్ చేసుకునే ఏకైక ఫెస్టివల్ దీపావళి. కాబట్టి దీపావళి ఖర్చులు కూడా ఆ రేంజ్‌లో ఉంటాయి. దీంతో ఈ సంవత్సరం దీపావళికి ప్రజల ఖర్చులు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 3. 75 లక్షల కోట్లకు షాపింగ్‌లకు, గిఫ్ట్స్‌కు ఖర్చు చేశారు. ఇందులో మీరు ఇంకో విషయం గుర్తించారు. ఓన్లీ గిఫ్ట్స్ అండ్ షాపింగ్‌లకు మాత్రమే ఈ ఖర్చు. ఇందులో టపాసుల ఖర్చు లేదు.

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) జాతీయ అధ్యక్షుడు బీసీ భారతీయ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఈ ఏడాది దీపావళికి ప్రజలు ఎంత మొత్తంలో ఖర్చు చేశారు అనే దానికి ఓ నివేదిక విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం దాదాపుగా రూ.3.75 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగి.. ఈ దీపావళి షాపింగ్ దేశవ్యాప్తంగా మార్కెట్‌లలో రికార్డులు సృష్టించింది.

సీఏఐటీ నివేదిక ప్రకారం రూ. 3.5 లక్షల కోట్ల పండుగ వ్యాపారంలో 13% ఆహారం – కిరాణా, 9% ఆభరణాలు, 12% బట్టలు వస్త్రాలు, 4% డ్రై ఫ్రూట్స్, స్వీట్లు – 4% వ్యాపారం జరిగిందని ప్రవీణ్ ఖండేల్వాల్ చెప్పారు. స్నాక్స్, గృహోపకరణాలు 3%, 6% సౌందర్య సాధనాలు, 8% ఎలక్ట్రానిక్స్ & మొబైల్‌లు, 3% పూజ సామాగ్రి & పూజ వస్తువులు, 3% పాత్రలు & వంటగది ఉపకరణాలు, 2% బేకరీ, 8% గిఫ్ట్ ఆర్టికల్స్, 4% ఫర్నిచర్ ఉన్నాయి. ఇక మిగిలిన 20% ఆటోమొబైల్స్, హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్, బొమ్మలు.. అనేక ఇతర వస్తువులు- సేవలపై కస్టమర్‌లు ఖర్చు చేశారు. ఈ దీపావళికి దేశవ్యాప్తంగా ప్యాకింగ్ వ్యాపారం కూడా పెద్ద మార్కెట్‌ను సంపాదించుకుంది.


Next Story

Most Viewed