సెప్టెంబర్ త్రైమాసికంలో తగ్గిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం!

by Disha Web Desk 17 |
సెప్టెంబర్ త్రైమాసికంలో తగ్గిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం!
X

ముంబై: దేశీయ అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో నికర లాభం రూ. 13,656 కోట్లుగా వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ. 13,680 కోట్లతో పోలిస్తే 0.18 శాతం క్షీణించింది. సంస్థ ఆదాయం 33.74 శాతం పెరిగి రూ. 2,32,863 కోట్లకు చేరుకున్నాయి. ఇంధన ధరలు పెరగడంతో ఆయిల్-టూ-కెమికల్ వ్యాపారం కారణంగా సంస్థ ఆదాయం మెరుగ్గా ఉందని రిలయన్స్ తెలిపింది.

అలాగే, సెప్టెంబర్ 30 నాటికి సంస్థ బకాయిలు రూ. 2.94 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇక, సమీక్షించిన త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలో టెలికాం జియో నికర లాభం 26.9 శాతం వృద్ధితో రూ. 4,729 కోట్లుగా ఉంది. ఈ త్రైమాసికంలో వినియోగదారు సగటు ఆదాయం(ఆర్పు) నెలకు రూ. 177.20 గా ఉంది. మొత్తం జియో కస్టమర్ బేస్ 42.76 కోట్లకు పెరిగింది.

రిలయన్స్ రిటైల్ నికర లాభం గతేడాదితో పోలిస్తే 36 శాతం పెరిగి రూ. 2,305 కోట్లుగా నమోదైంది. రిటైల్ విభాగం ఆదాయం 42.9 శాతం పెరిగి రూ. 64,920 కోట్లుగా ఉంది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో శుక్రవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర 1.16 శాతం క్షీణించి రూ. 2,471.95 వద్ద ముగిసింది.

Next Story

Most Viewed