రూ.2 వేల నోట్ల రద్దు.. ఇదే అసలు కారణమా?

by Dishafeatures2 |
రూ.2 వేల నోట్ల రద్దు.. ఇదే అసలు కారణమా?
X

దిశ, వెబ్ డెస్క్: రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ఇవాళ ప్రకటించింది. క్లీన్ నోట్ పాలసీ వల్లే 2 వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. అయితే రూ.2 వేల రద్దు వెనుక ఇంకో ముఖ్య కారణం ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. అదే డిజిటల్ పేమెంట్స్. ఇండియా డిజిటల్ పేమెంట్స్ వార్షిక రిపోర్టు ప్రకారం.. గడిచిన కొన్నేళ్లుగా దేశంలో డిజిటల్, యూపీఐ పేమెంట్స్ భారీగా పెరిగాయని ఆర్బీఐ చెప్పింది. యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డులు, మొబైల్, ప్రీపెయిడ్ కార్డుల ద్వారా దాదాపు 87.92 బిలియన్ ట్రాన్సక్షన్స్ జరిగాయని, వాటి విలువ ఒక్క 2022లోనే రూ.14.92 లక్షల కోట్లు ఉంటుందని స్పష్టం చేసింది.

కాగా 10.8 శాతం 2 వేల నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇక 2 వేల నోట్ల రద్దుపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వస్తోంది. దీని వల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలగదని కొంతమంది చెబుతోంటే.. దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపెట్టే అవకాశం ఉన్నట్లు మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

రూ.2000 నోట్ల రద్దు చేస్తూ RBI సంచలన ప్రకటన

2000 వేల నోట్లు రద్దు.. RBI నిబంధనలు ఇవే


Next Story