భారత్‌లో డిజిటల్ రూపీ లాంఛ్ చేసిన ఆర్బీఐ

by Disha Web Desk |
భారత్‌లో డిజిటల్ రూపీ లాంఛ్ చేసిన ఆర్బీఐ
X

దిశ, డైనమిక్ బ్యూరో : భారతదేశ ఆర్థిక రంగ చరిత్రలో విప్లవాత్మక మార్పులకు ఆర్బీఐ శ్రీకారం చుట్టింది. రిటైల్ డిజిటల్ రూపీని గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంఛ్ చేసింది. ఈ ట్రయల్‌లో దశల వారీగా పాల్గొనేందుకు సెంట్రల్ బ్యాంక్ ఎనిమిది బ్యాంకులను గుర్తించింది. 8 బ్యాంకుల్లో డిజిటల్ రూపీ ట్రయల్స్ చేయనుంది. డిజిటల్ టోకెన్ రూపంలో ఉండే దీనిని బ్యాంకుల ద్వారా పంపిణీ చేస్తారు. ఇది చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుంది. దేశంలోని నాలుగు బ్యాంకుల్లో నేటి నుంచి ట్రయల్స్ ప్రారంభించనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. తొలుత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, యస్ బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ లలో ఈ రూపీని ప్రారంభించనున్నారు. ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ అనే నాలుగు నగరాల్లో పరీక్షలు ప్రారంభమవుతాయి. తర్వాత అహ్మదాబాద్, గ్యాంగ్‌టక్, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, కొచ్చి, లక్నో, పాట్నా, సిమ్లా వరకు ఈ విప్లవాత్మక మార్పులు విస్తరించబడతాయని ఆర్బీఐ వెల్లడించింది.


Next Story

Most Viewed