ఇకపై రూపాయిల్లోనే ఫారెక్స్ కార్డులపై ఫీజులు, ఛార్జీల చెల్లింపులు!

by Disha Web Desk 17 |
ఇకపై రూపాయిల్లోనే ఫారెక్స్ కార్డులపై ఫీజులు, ఛార్జీల చెల్లింపులు!
X

ముంబై: విదేశీ ప్రయాణాలకు వాడే ఫారెక్స్ ప్రీపెయిడ్ కార్డులు, ట్రావెల్ కార్డులపై భారత్‌లో చెల్లించాల్సిన ఫీజులు, ఛార్జీలను ఇకపై తప్పనిసరిగా స్థానిక కరెన్సీ రూపాయిల్లోనే చెల్లించాలని ఆర్‌బీఐ సూచించింది. అలాగే, ఆయా కార్డుల వినియోగం కోసం అనుమతించిన కరెంట్ ఖాతా లావాదేవీలను ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ మేనేజ్‌మెంట్ నిబంధనల ప్రకారం నిర్దేశించిన పరిమితులకు లోబడి ఉంటుంది.

ట్రావెల్ కార్డులను కొనుగోలు చేసే దేశీయ ప్రయాణీకులు యూజర్ గైడ్‌లో పేర్కొన్న విధంగా చివరి లావాదేవీ నుంచి 10 రోజుల తర్వాత మాత్రమే వాడని విదేశీ మారకపు బ్యాలెన్స్‌ను రీఫండ్ చేసేందుకు అనుమతి ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. గతేడాది అక్టోబర్‌లో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ రూపాయి గ్లోబల్ కరెన్సీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ఈ క్రమంలోనే ఫారెక్స్ కార్డుల కోసం చెల్లించే ఫీజులు, ఛార్జీలను మన కరెన్సీలోనే చెల్లించే విధానాన్ని ప్రతిపాదించింది. ఫారెక్స్ ప్రీపెయిడ్, ట్రావెల్ కార్డులకు బ్యాంకు నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదని ఆర్‌బీఐ గతంలోనే స్పష్టం చేసింది.


Next Story

Most Viewed