- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rapido: ఫుడ్ డెలివరీ విభాగంలోకి రాపిడో
త్వరలో కార్యకలాపాలను మొదలుపెట్టేందుకు కంపెనీ అంతర్గతంగా చర్చలు జరుపుతోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఫుడ్ డెలివరీ మార్కెట్ అత్యంత వేగంగా పెరుగుతోంది. ఎప్పటినుంచో ఈ విభాగంలో జొమాటో, స్విగ్గీ వంటి కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. తాజాగా ప్రముఖ బైక్ రైడింగ్ సేవల కంపెనీ రాపిడో కూడా ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. త్వరలో కార్యకలాపాలను మొదలుపెట్టేందుకు కంపెనీ అంతర్గతంగా చర్చలు జరుపుతోంది. దీనికోసం వివిధ రెస్టారెంట్ల యాజమాన్యాలతో కంపెనీ వర్గాలు సంప్రదించినట్టు సమాచారం. ముఖ్యంగా జొమాటో, స్విగ్గీ లాంటి కంపెనీలు అనుసరిస్తున్న కమిషన్ విధానానికి భిన్నంగా కొత్త వ్యాపార వ్యూహంతో రాపిడో ఫుడ్ డెలివరీ విభాగంలో రాణించాలనే లక్ష్యంగా ఉంది. 2015లో క్యాబ్ బుకింగ్ సేవలను ప్రారంభించిన రాపిడో పదేళ్లలో అత్యంత వేగంగా విస్తరించింది. ఇటీవలే 1 బిలియన్ డాలర్ల మార్కెట్ విల్లువ సాధించిన నేపథ్యంలో మరిన్ని రంగాలకు విస్తరించాలని భావిస్తోంది. దేసవ్యాప్తంగా 100 నగరాల్లో సేవలందిస్తున్న రాపిడో ఈ ఏడాది ఆఖరు నాటీకి 500 నగరాలకు విస్తరించే పనిలో ఉంది.
READ MORE ...
Rapido: ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి ర్యాపిడో!.. జొమాటో, స్విగ్గీల ఆధిపత్యానికి చెక్?






