పేటీఎం వ్యవహారంపై సందేహాలకు ప్రశ్నావళి విడుదల చేసిన ఆర్‌బీఐ

by Dishanational1 |
పేటీఎం వ్యవహారంపై సందేహాలకు ప్రశ్నావళి విడుదల చేసిన ఆర్‌బీఐ
X

దిశ, బిజినెస్ బ్యూరో: పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులకు ఎక్కువగా వినియోగించే సాధనం కావడంతో పేటీఎం సంక్షోభం కారణంగా సమస్యలు ఉత్పన్నమవకుండా ఆర్‌బీఐ చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ప్రశ్నావళి(ఎఫ్ఏక్యూ-తరచుగా అడుగు ప్రశ్నలు)ని విడుదల చేసింది. ఇవి పేటీఎంపై ఆంక్షల వల్ల ఇబ్బంది పడే వారి సందేహాలను నివృత్తి చేస్తుందని ఆర్‌బీఐ పేర్కొంది. ఈ ప్రశ్నావళి ప్రధానంగా సాధారణ సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతా ఉన్నవారి సమస్యల నుంచి పేటీఎం నుంచి ఇతర పేమెంట్స్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసే వరకు అన్ని రకాల సమస్యలకు పరిష్కారం అందించేలా ఆర్‌బీఐ దీన్ని రూపొందించింది. ప్రధానంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలో జీతాలు పొందే వారికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని ఆర్‌బీఐ సూచించింది. అలాగే, ఆధార్‌తో లింక్ అయిన సబ్సిడీ, ఇతర ప్రభుత్వ ప్రత్యక్ష ప్రయోజనాల క్రెడిట్‌కు కూడా అవకాశం ఉండదని స్పష్టం చేసింది. సాధారణ బిల్లులు, రుణ వాయిదాల చెల్లింపులను పేటీఎం పేమెంట్స్ వాడుతున్న వారికి ఆ ఖాతాలో సొమ్ము ఉన్నంత వరకే అవకాశం ఉంటుందని, ఆ తర్వాత ఇతర మార్గాలను ఎంచుకోవాలని సూచించింది.


Next Story

Most Viewed