- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OpenAI: భారత్‌లో మొదటి కార్యాలయం ప్రారంభించనున్న ఓపెన్ఎఐ
ఉద్యోగుల నియామకాలను కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఏఐ కంపెనీ ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ రానున్న రోజుల్లో భారత మార్కెట్ తమకు ప్రధాన కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా కంపెనీ భారత్‌లో తన మొట్టమొదటి కార్యాలయాన్ని ప్రారంభించిననున్నట్టు వెల్లడించింది. చాట్‌జీపీటీని వాడుతున్న వారి సంఖ్య దేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో కంపెనీ తన తొలి ఆఫీస్ ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతానికి ఏ ప్రాంతంలో అనేది ఇంకా స్పష్టం చేయలేదు. ఉద్యోగుల నియామకాలను కూడా ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ ఉద్యోగులు స్థానికంగా భాగస్వామ్యంతో పాటు ప్రభుత్వం, వ్యాపార, డెవలపర్లు, పలు విద్యా సంస్థలతో సంబంధాలను మెరుగుపర్చడం కోసం పనిచేయనున్నారు. మొదటి ఆఫీసును ప్రారంభించడం, కొత్త ఉద్యోగుల నియామకాల ద్వారా దేశంలో ఏఐని మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడం, దేశంలో ఏఐ వృద్ధికి మద్దతివ్వడంలో కీలకమైన అడుగని ఓపెన్ఏఈ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అమెరికా తర్వాత ఓపెన్ఏఐకి భారత్ రెండో అతిపెద్ద మార్కెట్, అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తోంది. గడిచిన ఏడాది కాలంలోనే చాట్‌జీపీటీని వాడుతున్న యాక్టివ్ యూహర్ల సంఖ్య నాలుగు రెట్లు ప్రిగిందని ఆల్ట్‌మన్ వెల్లడించారు. అంతేకాకుండా, ఇదే నెలలో ఓపెన్ఏఐ భారత్‌లో తన మొదటి ఎడ్యుకేషన్ సమ్మిట్‌ను నిర్వహించనుంది. ఏడాది ఆఖరులో డెవలపర్‌డే కార్యక్రమాన్ని కూడా జరపనున్నట్టు కంపెనీ పేర్కొంది. ఇప్పటికే ఓపెన్ఐ భారత్‌లో ఇండియాఏఐ మిషన్‌తో భాగస్వామ్యం కోసం అంగీకారం తెలిపింది. దీని ద్వారా ప్రభుత్వానికి ఏఐ సిస్టమ్ నిర్మాణం చేపట్టనుంది.






